లోక్‌సభలోకి టీయర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు
లోక్‌సభలోకి టీయర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు..పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన రోజునే మళ్లీ దాడి...సంచలనం రేపుతున్న ఘటన..ఇటీవల ఇదే రోజు దాడి చేస్తామని ప్రకటించిన ఖలిస్తాన్ నేత
విధాత : లోక్ సభలో ఇద్దరు ఆగంతకులు టీయర్ గ్యాస్ వదిలిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఆగంతులు సభలో టీయర్ గ్యాస్ వదిలారు. దీంతో భయాందోళనలకు గురైన ఎంపీలు బయటకు పరుగులు పెట్టారు. వెంటనే భద్రతా సిబ్బంది ఆగంతకులు ఇద్దరితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారు నినాదాలు చేస్తు వెళ్లారు. భద్రతా వైఫల్యంపై ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రవాద నేత గురుపత్వంత్ సింగ్ గతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి జరిపిన డిసెంబర్ 13రోజున రోజునే మళ్లీ కొత్త భవనంపై తాము దాడి చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఐనప్పటికి భద్రతా విఫలమవ్వడం..ఆగంతకులు సభలోకి దూకి సభ్యులపై టీయర్ గ్యాస్ వదలడం సంచలనం రేపింది. దుండగులు ఖలిస్తాన్ ఉగ్రవాదులా ఇంకా ఇతరులా ఎవరన్నదానిపై విచారణ చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram