విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణిత్రావులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని, డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. చార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా నిందితులను విచారించాల్సి ఉన్నందునా.. నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మంగళవారమే వాదనలు ముగిసిపోగా, నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ తిరస్కరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణిత్రావులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Latest News
అదానీకి US SEC షాక్ - నేరుగా ఈమెయిల్‌కు సమన్లు!
పద్మ అవార్డులు 2026: తెలుగు తేజాలకు ఘన గౌరవం
3వ టీ20లోనూ భారత్‌దే ఆధిపత్యం : సిరీస్ కైవసం
పిల్లల కోసం షావుమీ ప్రత్యేక స్మార్ట్ వాచ్ : తల్లిదండ్రులకు భరోసా
రిపబ్లిక్ డేకి వాట్సప్ స్టిక్కర్లు వాట్సప్‌లోనే తయారుచేసుకోండి
మేడారం స్పెషల్ ... ఇప్పపువ్వు లడ్డు
గజదొంగకు ముగ్గురు స్టువర్టుపురం దొంగల తోడు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్-బెంగళూరు హైవే – యాక్సెస్ కంట్రోల్డ్‌గా మార్పుతో 5 గంటల్లో బెంగళూరు
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..45మందిలో తెలంగాణ వాసి
యాదగిరిగుట్ట సమీపంలోకి పెద్దపులి రాక !