తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా “Scheme for Special Assistance to States for Capital Investment (SASCI)” కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని నిర్మలను భట్టి కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) సహా విద్యా రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులకు సంబంధించి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) ఆమోదించిన విదేశీ ద్రవ్య సహకార(EAP) ప్రాజెక్టులకు FRBM పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి వెంట ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గౌరవ ఉప్పల్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
ఇండియాలో GenZ.. ఉద్యమం రానుందా?
పురావస్తు, పర్యాటక శాఖలలో టూరిస్టు గైడ్ పోస్టులు
