Birla Ilaiah : రౌడీ షీటర్ ను చేర్చుకుని..గురివింద నీతులా
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను 'రౌడీషీటర్' అన్న కేసీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్ మండిపడ్డారు. 32 కేసులున్న సల్మాన్ ఖాన్ ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్, ఒక్క కేసు లేని నవీన్ పై విమర్శలు చేయడం 'గురివింద నీతులు'గా అభివర్ణించారు. శ్రీశైలం యాదవ్ కూడా కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు.
విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను రౌడీ షీటర్ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు వేస్తున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్ కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 32కేసులున్న సల్మాన్ ఖాన్ అనే రౌడీ షీటర్ ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న రోజునే …ఒక్క కేసు లేని నవీన్ యాదవ్ ను రౌడీషీటర్ అని కేసీఆర్ విమర్శించడం గురివింద గింజ సామేతను గుర్తు చేస్తుందన్నారు. బీసీ వర్గం యాదవుడికి జూబ్లీహిల్స్ లో టికెట్ ఇస్తే..సహించలేని కేసీఆర్ రౌడీషీటర్ అంటూ అవమానించాడని విమర్శించారు. బీసీలను, యాదవులను అవమానించిన కేసీఆర్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను ఓడించి గుణ పాఠం చెప్పాలన్నారు.
తెలంగాణ దళితులు, , బడుగు బలహీనవర్గాలు ఓట్లు వేసి గెలిపిస్తే గతంలో కేసీఆర్ సీఎం అయ్యాడని, కుంభకర్ణుడు ఆరు నెలలు తిని ఆరునెలలు నిద్రపోయినట్లు గా కేసీఆర్ రాజకీయం ఉందని అయిలయ్య విమర్శించారు. ఫామ్ హౌస్ లో చెట్టు కింద హాయిగా కూర్చొన్న కేసీఆర్..ప్రభుత్వంలో ఉండి పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన పడి ఏడుస్తున్నడన్నారు. కనీసం పార్టీ ఆఫీసుకు కూడా రాకుండా నాయకులనే ఫామ్ హౌస్ కు పిలిపించుకుంటున్న కేసీఆర్ కు ఇంకా అహంకారం తగ్గలేదని అయిలయ్య విమర్శించారు.
నా జోలికి వస్తే.. నీ చరిత్ర బయటకు తీస్తా : రెచ్చిపోయిన శ్రీశైలం యాదవ్
నా జోలికి, నా కొడుకు కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ జోలికి వస్తే నీ చరిత్ర బయటకు తీస్తానంటూ శ్రీశైలం యాదవ్ రెచ్చిపోయారు. నన్ను మాట్లాడొద్దని చెప్పడంతో ఆగిపోతున్నానని, మరోసారి నా గురించి మాట్లాడితే కేసీఆర్ చరిత్ర తీస్తానని, నన్నే రౌడీ షీటర్ అంటావా అంటూ శ్రీశైలం యాదవ్ మండిపడ్డారు. ఎన్నికలలో రాజకీయాలు, అభివృద్ధి గురించి మాట్లాడితే మంచిదని, వ్యక్తిగత విమర్శలు, బురద చల్లే రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram