MP Raghunandan Rao | త్వరలో బీఆర్‌ఎస్‌ను వీడనున్న మరో 15 మంది ఎమ్మెల్యేలు..!
MP Raghunandan Rao | మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల ఆఖరులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి బీఆర్‌ఎస్ నుంచి మరో 15 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
MP Raghunandan Rao : మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల ఆఖరులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి బీఆర్‌ఎస్ నుంచి మరో 15 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా బీఆర్‌ఎస్ పార్టీ మరో 15 నెలల వరకయినా ఉంటుందా.. లేదా..? అనేది అనుమానమేనని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు తడబడుతున్నాయని రఘునందన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కమీషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని రైతుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని ఈ సందర్భంగా రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఐదు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ఈ సమయం మొత్తం రాజకీయాల గురించే తప్ప.. రాష్ట్ర అభివృద్ధికి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని ఆయన విమర్శించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram