దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం
గతంలో పుల్వామా ఉగ్ర దాడి, ప్రస్తుతం రామాయలం పేరు చెప్పి బీజేపి ఓట్లు దండుకుంటుందని సిట్టింగ్ ఎంపీ, బీఆరెస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు

– ఒకప్పుడు పుల్వామా, ఇప్పుడు రామాలయం పేరుతో బీజేపీ ఓట్ల డ్రామా
– పదేళ్ల లో తెలంగాణ కు పైసా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం
– బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలతో రైతులు ఆగం
– కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి చెందింది
– ప్రజలు వాస్తవాలు గ్రహించి ఓట్లు వేయాలి
– కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలతో గద్దెనెక్కింది.. మళ్ళీ మోసపోకండి
– సిట్టింగ్ ఎంపీ, బీఆరెస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : గతంలో పుల్వామా ఉగ్ర దాడి, ప్రస్తుతం రామాయలం పేరు చెప్పి బీజేపి ఓట్లు దండుకుంటుందని సిట్టింగ్ ఎంపీ, బీఆరెస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ నియోజక వర్గం లో ని కేశంపేట మండల కేంద్రం లో ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కులం, మతం, దేవుడి పేరుతో బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని,ఇలాంటి రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు.కేంద్రంలో పదేళ్లు అధికారం లో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందిశూన్యమని,పాలమూరు, రంగా రెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించని బీజేపీ ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.రూ.వేల కోట్ల దేశ సంపద కొల్ల గొట్టిన ఆర్థిక నేరస్తుల బకాయిలు మాఫీ చేస్తూ దొంగలకు సద్ధులు కడుతున్నదని మన్నే శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.ఇవన్నీ ప్రజలు గ్రహించాలని, ఏ పార్టీ తెలంగాణ ను అభివృద్ధి చేసిందో వాస్తవాలు తెలుసు కోవాలని ఆయన కోరారు.
కేంద్రం నల్ల చట్టాలు తీసుకొచ్చి 750 మంది రైతుల ఉసురు తీసుకుందన్నారు.కేంద్రం రైతులు పండించిన ధాన్యాన్ని కూడా తీసుకోవడానికి ముందుకు రాకుండా తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నదని,
ఈడీ ,ఐటీ , సీబీఐ వ్యవస్థ లను వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీ లను తీవ్ర ఇబ్బందూలకు గురిచేస్తున్నదన్నారు.బీజేపీ ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ను ఆగం చేసే పనిలో పడింది. ఉచిత హామీలు, మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారం లోకి వచ్చిందన్నారు.కాంగ్రెస్ నేతల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఏర్పడిన రాష్ట్రాన్ని ఎన్నడూ లేనంత అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని మన్నే పేర్కొన్నారు. కేసీఆర్ ఓ విప్లవ కారుడు…సాధించుకున్న తెలంగాణను అద్భుతంగా తీర్చి దిద్దడంలో కేసీఆర్ పాత్ర ఎంతో గొప్పదని, ఈ విషయం తెలంగాణ ప్రజలు గ్రహించాలని ఆయన అన్నారు.పసి బిడ్డ నుంచి ,వృద్ధుల వరకు ప్రతీ ఓక్కరు కేసీఆర్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే ఉన్నారన్నారు.తెలంగాణ వాణిని పార్లమెంటులో వినిపించాలంటే పాలమూరు పార్లమెంట్ స్థానంలో నుంచి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఐదేళ్లలో తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంటులో ఎక్కువ సమయం మాట్లాడిన సభ్యుల్లో తాను ఒకరినన్నారు. తాను పార్లమెంట్ లో మాట్లాడలేదని కొందరు అంటున్నారని, ఇలా అనే వారు ఈ ఇదేళ్లు పార్లమెంట్ రికార్డ్ లు తిరగస్తే తాను ఎంత మాట్లాడ్డానో తెలుస్తుందన్నారు. మన్నే శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడలేదనే విమర్శలు ఇక మానుకొండని ఇతర పార్టీ ల నేతలకు హితవు పలికారు.తాను పక్క స్థానికున్ని..మీ వాడిని.. మా కంపెనీ ల ద్వారా ఇప్పటికే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించాం.. ఈ ప్రాంతంతో నాది పేగు బంధం ఉంది.. మళ్ళీ గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కి ఎంతో పాటుపడుతానని ఆయన పేర్కొన్నారు. ప్రజలు భారీ మెజారిటీతో ఆశీర్వదిస్తారనే విశ్వాసం ఉండన్నారు.ఈ సమావేశం లో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీ ఆర్ ఎస్ శ్రేణులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.