బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభమైంది. ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించారు.

విధాత, హైదరాబాద్ : డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభమైంది. ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్ 10 + 2 పూర్తి చేసిన వారితో పాటు రెండేళ్ల పాలిటెక్నిక్ డిప్లోమా .ఐటిఐ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్లు www.braouonline.in నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు, 10 వ తరత తరగతి మార్కుల మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, పాస్ పోర్టు సైజు ఫోటోలు, అవసరమైన వారు కుల దృవీకరణ పత్రంతో సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఓపెన్ వర్సిటీ అధ్యయన కేంద్రంలో సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

డిగ్రీ, పీజీ, డిప్లొమా వంటి సర్టిఫికెట్ కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్‌ వివరాలు:

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, 2026-27 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ, డిప్లొమా వంటి సర్టిఫికెట్ కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదల చేయడం తెలిసిందే. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు..పీజీలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజ శాస్త్రం, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ లలో ఎంఏ కోర్సులకు, అలాగే వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, గణితశాస్త్రం, అనువర్తిత గణితశాస్త్రంలో ఎంఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ కోర్సులతో పాటు పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి.

దేశ పౌరులు ఎవరైనా తమ కనీస అర్హతను అనుసరించి ఈ కోర్సుల్లో చేరవచ్చు. అయితే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధ్యయన కేంద్రాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతల వివరాలు :

డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా పదో తరగతి తర్వాత ఏదైనా రెండేళ్ల కోర్సు, డిప్లొమా, ఐటిఐ, పాలిటెక్నిక్, లేదా ఓపెన్ స్కూల్‌లో ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా ఈ కోర్సులకు అర్హులు. ఇతర కోర్సుల విద్యార్హతలు, ఫీజుల పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్లు www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించవచ్చు.

ఇక ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును ఆగష్టు 7, 2026 లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీ 2021-22 నుంచి 2025-26 బ్యాచ్‌లకు చెందిన రెండు, మూడో సంవత్సరం విద్యార్థులు… అలాగే పీజీ 2023-24 నుంచి 2025-26 బ్యాచ్‌లకు చెంది, సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా ఇప్పుడు తమ ట్యూషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా TS ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు 73829 29570, 040-23680333/444/555లో లేదా టోల్‌ ఫ్రీ నెం.18005990101లో సంప్రదించవచ్చని సూచించారు.

Latest News