CM Revanth Reddy | మాది అందరి ప్రభుత్వం.. సర్వమతాలకు ప్రాధాన్యతనిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూరీ జగన్నాథ రధయాత్రను ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు

CM Revanth Reddy | మాది అందరి ప్రభుత్వం.. సర్వమతాలకు ప్రాధాన్యతనిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఇస్కాన్ పూరీ జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూరీ జగన్నాథ రధయాత్రను ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం స్వామి వారికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తామని, అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం మా బాధ్యత అన్నారు. తెలంగాణ సంస్కృతిలో సర్వమత సమ్మేళనం ఫరిడవిల్లుతుందన్నారు. రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఈ యాత్ర ద్వారా భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు.

మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో మా ప్రభుత్వం పని చేస్తుందని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు వస్తుందన్నారు. ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు యాత్ర చేరుకున్న అనంతం అక్కడే పండుగ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో సంగీత కచేరీలు, మహా హారతి, ప్రవచనాల నిర్వాహణ, భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు 108 ఆలయాల్లో భగవధానం నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉత్సవాలకు వేలాదిగా భక్తులు హాజరయ్యారు.