CM Revanthreddy | తొలి నార్త్ఈస్ట్ అనుబంధ కేంద్రం తెలంగాణలోనే : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఐక్యతా స్ఫూర్తిని చాటుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, వాణిజ్య అనుబంధాన్ని పటిష్టం చేయడానికి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవాలు గురువారం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యాయి.
విధాత, హైదరాబాద్ :
తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఐక్యతా స్ఫూర్తిని చాటుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, వాణిజ్య అనుబంధాన్ని పటిష్టం చేయడానికి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవాలు గురువారం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మన దేశ ఈశాన్య ప్రాంతం పర్యావరణ సంపదతో పాటు సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతం అని వెల్లడించారు. తెలంగాణ సోదరుడు త్రిపుర గవర్నర్‌గా పని చేస్తున్నారు.. త్రిపుర సోదరుడు తెలంగాణ గవర్నర్‌గా పని చేస్తున్నారని చెప్పారు. త్రిపుర, తెలంగాణ మధ్య ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి అని ఆయన ఆకాంక్షించారు. ఇండియాలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామంటూ పిలుపునిచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ఆయన ప్రకటించారు.
దేశంలో మొదటి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడానికి గవర్నర్ నాయకత్వం వహించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో సహా 8 రాష్ట్రాలతో సమష్టిగా పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అస్సాం, అరుణాచల్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు అవసరమైన హాస్టల్, ఆహారం, కళలు, చేతి వృత్తులు, ప్రదర్శన వేదికలు ఈ భవనాల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram