బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు
బీఆరెస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది

విధాత : బీఆరెస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీఆరెస్ కండువా ధరించి శామీర్ పేటలోని ఎన్నికల కేంద్రానికి వెళ్ళారని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఆధారాలను సైతం ఆయన సమర్పించారు. దీంతో జనగామ పోలీసులు 188 ఐపీసీ, 130 సీఆర్పీ సెక్షన్ల కింద పల్లాపై కేసు నమోదు చేశారు.