Hyderabad | ప్యాకెట్ పాలు పగిలిపోయాయని పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు..
Hyderabad | ఇది అరుదైన కేసు.. ప్యాకెట్ పాలు( Packet Milk ) పగిలిపోయాయని ఓ వ్యక్తి పోలీసులకు( Police ) ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్( Hyderabad ) నగరంలోని కూకట్‌పల్లి( Kukatpally ) పోలీసు స్టేషన్‌లో వెలుగు చూసింది.

Hyderabad | హైదరాబాద్ : ఇది అరుదైన కేసు.. ప్యాకెట్ పాలు( Packet Milk ) పగిలిపోయాయని ఓ వ్యక్తి పోలీసులకు( Police ) ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్( Hyderabad ) నగరంలోని కూకట్‌పల్లి( Kukatpally ) పోలీసు స్టేషన్‌లో వెలుగు చూసింది.
కూకట్‌పల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఈ. రాములు అనే వ్యక్తి.. రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో హెరిటేజ్ టోన్డ్ మిల్క్ ప్యాకెట్లు రెండింటిని ఈ నెల 22న కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లాక అదే రోజు ఒక ప్యాకెట్‌ను ఉపయోగించారు. ఇక మరుసటి రోజు అంటే 23వ తేదీన మరో ప్యాకెట్‌ను ఓపెన్ చేసి.. మరిగించగా అవి పగిలిపోయాయి. దుర్వాసన కూడా వచ్చింది. దీంతో రత్నదీప్ సూపర్ మార్కెట్‌కు వెళ్లి ప్రశ్నించగా, దానికి మేం ఏం చేస్తామని స్టోర్ మేనేజర్ దురుసుగా సమాధానం ఇచ్చాడు.
ఈ క్రమంలో బాధిత వ్యక్తి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రత్నదీప్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారని, నాణ్యత లేని, గడువు మించిన పదార్థాలను విక్రయిస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన పోలీసులు.. 125, 274, 275 బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా కేవలం ఒక సంస్థ నుండి వచ్చే పాలే కాకుండా ఈ మధ్యకాలంలో పలు సంస్థల పాలు పగులుతున్నాయి, వాసన వస్తున్నాయని వినికిడి కూడా ఎక్కువగా ఉంది. వీటిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ఎంతోమంది వినియోగదారులు కోరుతున్నారు.