Telangana DCC |డీసీసీల ఎంపిక‌పై సీనియర్ల నారాజ్!

కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల తెలంగాణలో కొత్తగా డీసీసీలను నియమించిన విషయం తెలిసిందే. అయితే, పార్టీలో కొందరు ఈ నియామకాలపై అంతర్గత అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది.

Telangana DCC |డీసీసీల ఎంపిక‌పై సీనియర్ల నారాజ్!

విధాత, హైదరాబాద్ :

కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల తెలంగాణలో కొత్తగా డీసీసీలను నియమించిన విషయం తెలిసిందే. అయితే, పార్టీలో కొందరు ఈ నియామకాలపై అంతర్గత అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సొంత జిల్లా నల్గొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. పున్న కైలాష్ నేతకి డీసీసీ ఎలా ఇచ్చారు అంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. తక్షణమే పున్న కైలాష్ నేత ను డీసీసీ గా తొలిగించాలని లేఖ‌లో మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇదే బాటలో మరి కొంత మంది నాయకులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ కాంగ్రెస్‌లో విభేదాలు బహిర్గతం కావడంతో, ఇకపై పార్టీ ఏపు నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలోని అన్ని జిల్లాలకు కాంగ్రెస్​ అధిష్ఠానం అధ్యక్షులను నియమించింది. కానీ, సంగారెడ్డిని మాత్రం పక్కన పెట్టింది. అక్కడ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి నిర్మలరెడ్డి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. నారాయణఖేడ్​కు చెందిన ఓ యువ నాయకుడు అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారని, అయితే పలువురు నేతలు అడ్డుకోవడంతో నియామక ప్రక్రియ ఆగిపోయినట్లు పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్యకు ఇవ్వడం గమనార్హం. పలువురు సీనియర్​ నేతలు ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటికే రెండు పదవులు ఉన్న బీర్ల ఐలయ్యను డీసీసీ ప్రెసిడెంట్ చేయడంపై పార్టీలోని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కంది శ్రీనివాస్ రెడ్డి సైతం డీసీసీ ఆశించారు. కానీ డీసీసీ ఎంపిక లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.