మందుబాబు మాస్టర్ మైండ్..పోలీసుల మైండ్ బ్లాక్..!

ఓ మందుబాబు తన మాస్టర్ మైండ్ తో.. కారులోని ఓ బటన్ నొక్కితే మారిపోయే నెంబర్ ప్లేట్ ను చూసిన జూబ్లీహిల్స్ పోలీసులకు మైండ్ బ్లాక్ అయిన ఘటన వైరల్ గా మారింది.

మందుబాబు మాస్టర్ మైండ్..పోలీసుల మైండ్ బ్లాక్..!

విధాత, హైదరాబాద్ : చట్టాలు..నిఘా చర్యలు ఎన్ని ఉన్నా..నేరగాళ్లు సరికొత్త వ్యూహాలతో పోలీసుల కంటే అడ్వాన్స్ గా ఆలోచిస్తూ నేరాలకు పాల్పడుతున్న తీరు తరచూ వెలుగుచూస్తున్నాయి. అలాంటి ఓ సరికొత్త నేరం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ..పోలీసులను సైతం షాక్ కు గురి చేస్తుంది. ఓ మందుబాబు తన మాస్టర్ మైండ్ తో.. కారులోని ఓ బటన్ నొక్కితే మారిపోయే నెంబర్ ప్లేట్ ను చూసిన జూబ్లీహిల్స్ పోలీసులకు మైండ్ బ్లాక్ అయిన ఘటన హాట్ టాపిక్ గా మారింది.

ఓ వ్యక్తి ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడం కోసం.. తన బీఎండబ్ల్యూ కారుకు క్షణాల్లో నెంబర్లు మారిపోయే నెంబర్ ప్లేట్ ను అమర్చి పోలీసులను, రవాణా అధికారులను బురిడి కొట్టించడం ఇప్పుడు వైరల్ అవుతుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అయితే అతడి కారునెంబర్ ప్లేట్ మార్చే ప్రత్యేక సిస్టమ్‌ను చూసి పోలీసులు ఖంగుతిన్నారు. పోలీసులకు దొరక్కుండా..ట్రాఫిక్ చలాన్లు పడకుండా చేసుకునేందుకు వేర్వేరు నెంబర్ ప్లేట్‌లతో తనిఖీ అధికారులను బురిడి కొట్టించే యత్నం చేస్తున్న నిర్వాకం వెలుగుచూసింది.

ఆ మందుబాబు తన మాస్టర్ మైండ్ తో ఆధునిక టెక్నాలాజీని వాడేసి కారులోని ఓ బటన్ నొక్కితే కారుకు అమర్చిన నెంబర్ ప్లేట్ లోని నెంబర్లు మారిపోయే సిస్టమ్ ఏర్పాటు చేశాడు. కారు నెంబర్ ప్లేట్ మార్చాలంటే కిందకు దిగనవసరం లేకుండా..క్షణాల్లోనే కారులోని ఓ బటన్ నొక్కితే చాలు క్షణాల్లో ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ మారిపోయేలా ఒక ప్రత్యేక పరికరాన్ని సెట్ చేసుకున్నాడు. కారులోని ఆ వింత పరికరాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఆ మందుబాబు మాస్టర్ మైండ్ టెక్నిక్ చూసి…పోలీసుల మైండ్ బ్లాక్ అయిపోయింది.

ఈ సరికొత్త నేరంపై పోలీసులు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కారును సీజ్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు..అసలు ఈ నెంబర్లు మారే నెంబర్ ప్లేట్ వెనుక వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. వాటిని ఎలా తయారు చేస్తున్నారు..ఎక్కడ తయారు చేస్తున్నారు..ఎవరు తయారు చేస్తున్నారు..ఎన్ని వాహనాలకు ఇలాంటి మాయ నెంబర్ ప్లేట్ ను పెట్టారన్నదానిపై విచారణ కొనసాగిస్తున్నారు.