రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 2024 మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 2024 మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు
433కేంద్రాల్లో మొదలైన కొనుగోళ్లు
అందుబాటులో 14 లక్షల టన్నుల గోనె సంచులు
విధాత: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 2024 మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 433 కొనుగోలు కేంద్రాల నుంచి 4345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ముందుగానే ప్రారంభించింది. ఈ యాసంగి ఈ సీజన్లో మొత్తం 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు 5422 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు అధికారులు చెపుతున్నారు. మరో 1727 కేంద్రాలు మరో రెండు రోజుల్లో తెరిచేందుకు సన్నద్ధమైందంటున్నారు. ఇప్పటికే అయిదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి కాగా గతేడాది ఈ సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కూడా కాలేదని చెపుతున్నారు.
ఈ ఏడాది దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే పౌరసరఫరాల సంస్థ వద్ద 14 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లకు ఇవి సరిపోతాయి. మిగతావి వీలైనంత తొందరగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు చెపుతున్నారు.