Shooting in Hyderabad | నాంపల్లి రైల్వేస్టేషన్‌ దగ్గర కాల్పుల కలకలం.. గొడ్డళ్లతో పోలీసులపై దాడికి యత్నం

Shooting in Hyderabad | హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం చెలరేగింది. చైన్‌ స్నాచింగ్‌ ముఠా సంచరిస్తోందనే సమాచారం మేరకు తెల్లవారుజామునే నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగారు.

Shooting in Hyderabad | నాంపల్లి రైల్వేస్టేషన్‌ దగ్గర కాల్పుల కలకలం.. గొడ్డళ్లతో పోలీసులపై దాడికి యత్నం

Shooting in Hyderabad : హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం చెలరేగింది. చైన్‌ స్నాచింగ్‌ ముఠా సంచరిస్తోందనే సమాచారం మేరకు తెల్లవారుజామునే నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ముఠా కదలికలను గమనించి పట్టుకునేందు పోలీసులు ప్రయత్నించారు.

ఓ చైన్‌ స్నాచింగ్‌ ముఠా ప్రయాణికుల మెడలో ఆభరణాలను దోచుకునేందకు ప్రయత్నం చేయడం చూసి పోలీసుల వారిని పట్టుకోబోయారు. దాంతో ఆ ముఠా గొడ్డళ్లతో పోలీసులపై దాడికి ప్రయత్నించింది. దొంగలు గొడ్డళ్లతో మీదకు రావడంతో ఆత్మరక్షణ కోసం ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో రాజు అనే చైన్‌ స్నాచర్‌కు గాయాలయ్యాయి. అతడిని అదుపులోకి తీసుకుని, అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ముగ్గురు దొంగలను కూడా అరెస్ట్‌ చేశారు. నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు.