విధాత, హైదరాబాద్ : విద్యార్థి దశలో నక్సల్స్ విప్లవోద్యమం పట్ల ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ) జనజీవన స్రవంతిలోకి వచ్చాక తను అర్థాంతరంగా ఆపేసిన చదువులను ఒక్కోటిగా పూర్తి చేస్తూ దూసుకపోతున్నారు. గన్ను వదిలి పెన్ను పట్టిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ) ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో ప్రతిభ చాటారు.
గతంలో మధ్యలో ఆపేసిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షను ఇటీవల ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతితో రాశారు. గురువారం విడుదలైన ఫలితాల్లో తెలుగు పరీక్షలో 72 మార్కులతో పాసయ్యారు. ఇంటర్‌లో మొత్తం 614 మార్కులు సాధించారు. ఇటీవల లాసెట్‌లోనూ ఆయన 349వ ర్యాంక్ సాధించడం విశేషం. లా చదువాలన్నది తన ఆశయం అని …అది పూర్తి చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
