• Telugu News
  • /Telangana

Jagadish Reddy : దీక్షా దీవస్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్షను గుర్తు చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నవంబర్ 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దీవస్ కార్యక్రమం నిర్వహించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Nov 29, 2025, 2:18 pm IST
Read Time: 2 mins
Jagadish Reddy : దీక్షా దీవస్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

విధాత : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను గుర్తు చేస్తూ..బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నవంబర్ 29 దీక్షాదీవస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దీవస్ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి హాజరయ్యారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి, కల్లూరి రాం చంద్ర రెడ్డి, గాదె నరేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.