Ex MLA Jeevan Reddy | కాంగ్రెస్‌లో దూరినోళ్లను తరిమికొట్టండి
మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో స్వార్ధ నేతలను తరిమికొట్టాలని, జగన్ ఎమ్మెల్యే సంజయ్ చేర్కును తీవ్రంగా వ్యతిరేకించారు.

విధాత : స్వార్ధంతో కాంగ్రెస్ పార్టీలో దూరినోళ్లను తరిమికొట్టాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారం కోసం కాంగ్రెస్‌లో చేరి.. అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలను గోస పెడుతున్న వారిని తరిమి కొట్టాలన్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి తామంతా కష్టపడ్డామని..తినే టైంలో మరొకడు వస్తే ఊరికే ఉంటామా అంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్, ఆయన అనుచరుల వ్యవహారశైలి సరిగ్గా లేదంటూ మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోతోందో అర్థం కావడం లేదంటూ.. పార్టీ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే జీవన్ రెడ్డి పలుమార్లు ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పై విమర్శలు గుప్పించారు. సంజయ్ చేరికను తీవ్రంగా వ్యతిరేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ..ఏకంగా పార్టీ నాయకత్వం తీరుపై విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.