Gadi Cheruvu waterfalls | తెలంగాణలో మరో అద్భుత జలపాతం.. పాల నురగల్లా గడి చెరువు జలధార
Gadi Cheruvu waterfalls | తెలంగాణ నయాగరా( Telangana Naigara ) జలపాతంగా పేరొందిన బొగత జలపాతానికి( Bogatha Waterfalls ) సమీపంలో మరో జలపాతం వెలుగులోకి వచ్చింది. ములుగు( Mulugu ) జిల్లా వెంకటాపురం, వాజేడు( Vajedu ) మండలాల సరిహద్దుల్లోని అభయారణ్యంలోని మహితాపురం( Mahithapuram ), బొల్లారం గ్రామాల సమీపంలో.. గడి చెరువు జలపాతం( Gadi Cheruvu waterfalls ) పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Gadi Cheruvu waterfalls | తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరో అద్భుత జలపాతం బయటపడింది. తెలంగాణ నయాగరా( Telangana Naigara ) జలపాతంగా పేరొందిన బొగత జలపాతానికి( Bogatha Waterfalls ) సమీపంలో మరో జలపాతం వెలుగులోకి వచ్చింది. ములుగు( Mulugu ) జిల్లా వెంకటాపురం, వాజేడు( Vajedu ) మండలాల సరిహద్దుల్లోని అభయారణ్యంలోని మహితాపురం( Mahithapuram ), బొల్లారం గ్రామాల సమీపంలో.. గడి చెరువు జలపాతం( Gadi Cheruvu waterfalls ) పర్యాటకులను ఆకర్షిస్తోంది. పచ్చదనం పరుచుకున్న వృక్షాలు, కొండలపై నుంచి పరవళ్లు తొక్కుతున్న పాల నురగలాంటి గడి చెరువు జలధారల కింద పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు.
పాల ధారల్లా జాలువారుతున్న ఆ జలపాతాల సవ్వడిని పర్యాటకులు( Tourists ) తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. ఆ చల్లని గాలులకు తన్మయత్వం చెందుతున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకుంది. జలపాతం సుమారు 120 అడుగుల ఎత్తైన కొండలపై నుండి పాల ధారలా కిందకు దూకుతుంది. ఎటు చూసినా ఎత్తైన కొండలు, గుట్టలు.. దట్టమైన అడవి, పచ్చని చెట్ల నడుమ జాలువారుతున్న ఈ జలపాతాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ గడి చెరువు జలపాతాన్ని తిలకించాలంటే సుమారు 2 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది.