Hyderabad | గుంపు మేస్త్రి ఇంట్లో చోరికి పాల్పడిన దుండగులు
Hyderabad | ఓ గుంపు మేస్త్రీలో ఇంట్లో దొంగలు పడ్డారు. అది కూడా నగరం నడిబొడ్డున బోరబండలో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Hyderabad | హైదరాబాద్ : ఓ గుంపు మేస్త్రీలో ఇంట్లో దొంగలు పడ్డారు. అది కూడా నగరం నడిబొడ్డున బోరబండలో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. బోరబండ పోలీసు స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్‌కు చెందిన సేనాపతి హరిబాబు అనే వ్యక్తి గుంపు మేస్త్రీగా కొనసాగుతున్నాడు. పలువురికి పని కల్పిస్తూ తాను సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గుంపు మేస్త్రీ, అతని కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో.. దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రూ. 76 వేల నగదును దొంగలు అపహరించారు.
గుంపు మేస్త్రీ ఇంటికి వచ్చి చూడగా, దోపిడీకి పాల్పడిన ఆనవాళ్లు కనిపించాయి. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. దీంతో తన ఇంట్లో ఉన్న రూ. 76 వేల నగదును దొంగలు అపహరించారని హరిబాబు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.