Holidays | విద్యార్థులకు శుభవార్త.. సెప్టెంబర్ 10 నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు..!
విద్యార్థులకు శుభవార్త.. సెప్టెంబర్ 10 నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు..!

Holidays | హైదరాబాద్ : విద్యార్థులకు( Students ) శుభవార్త.. రేపట్నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు( Holidays ) మూతపడనున్నాయి. ఎందుకంటే ఈ నెల 5వ తేదీన మిలాద్ ఉన్ నబీ( Milad-un-Nabi ) కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆ మరుసటి రోజు అంటే 6వ తేదీన(శనివారం) వినాయక నిమజ్జన( Ganesh Immersion ) కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్కల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇక ఆదివారం( Sunday ) ఎలాగూ సెలవు దినం కాబట్టి.. విద్యార్థులకు మూడు రోజులు సెలవులు కలిసి వచ్చాయి.
ఈ సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. వచ్చే వారం ఎఫ్ఏ2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల చివర్లో దసరా సెలవులు కూడా రానున్నాయి. 13 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 4వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలలు తిరిగి తెరుచుకున్న తర్వాత ఎస్ఏ1 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్స్‌ను అక్టోబర్ 24 నుంచి 31 మధ్యలో నిర్వహించనున్నారు.