gruha jyothi scheme । కొత్త దరఖాస్తుదారులకూ గృహజ్యోతి
గృహజ్యోతి పథకం కోసం ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోనివారికి మరో అవకాశం కల్పించి, వారికీ ఈ పథకాన్ని అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు.

విద్యుత్తు ఉత్పత్తిలో సాంకేతిక సమస్యల నివారణకు త్రిసభ్య కమిటీ
కాళేశ్వరం సహా అన్ని లిఫ్టుల విద్యుత్తు వినియోగంపై నివేదికలివ్వాలి
విద్యుత్తు శాఖపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Griha Jyothi scheme । గృహజ్యోతి పథకం (gruha jyothi) కింద ఉచిత విద్యుత్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంంలో అర్హులై ఉండి, గతంలో దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం (opportunity to re-apply) కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. గృహ జ్యోతి పథకాన్ని వారికీ వర్తింపచేయాలని చెప్పారు. ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్ (SPDCL), ఎన్పీడీసీఎల్ (NPDCL) ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై బుధవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ (Praja Bhavan)లో విద్యుత్తు శాఖ (Electricity Department) అధికారులతో భట్టి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెన్‌కో నిర్వహించే విద్యుత్తు ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ (three-member committee) వేయాలని సూచించారు. విద్యుత్తు ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను (technical problems) ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేసి పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా జెన్ కో సీఎండీ నిర్ణయం తీసుకుని విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం రాకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. విద్యుత్తు ఉత్పత్తి (power generation) విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. జల విద్యుత్ కేంద్రాల్లో (hydro power plants) సాంకేతిక సమస్యలు ఎదురైతేవెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఇందులో ఎలాంటి ఆలసత్వం వహించవద్దని భట్టి తెలిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ -1లో (Bhadradri Thermal Power Station) జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్‌కు మరమ్మతులు చేయాలా లేక కొత్తది కోనుగోలు చేయాలా? అనే అంశాన్ని టెక్నికల్ కమిటీకి పరిశీలిస్తోందని భట్టివిక్రమార్క తెలిపారు. డిసెంబర్ 2023కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నివేదించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయాలను అమలు చేసే సమయంలో సీఎండీలు తప్పనిసరిగా ఎనర్జీ సెక్రటరీని సంప్రదించాలని సూచించారు.
227 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రక్రియ మొదలు
ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 227 సబ్ స్టేషన్ల నిర్మాణానికి (construction of 227 substations) ప్రక్రియ మొదలైందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. అందులో 113 సబ్ స్టేషన్లకు స్థల సమస్య లేదని తెలిపారు. మిగతా వాటికి స్థలాలను కలెక్టర్లు కేటాయించాల్సి ఉందని చెప్పారు. కాళేశ్వరం (Kaleswaram) సహా ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు (lift irrigation projects) ఎన్ని మెగావాట్ల విద్యుత్తును ఉపయోగిస్తున్నారు? అందుకు ఎంత మేర ఖర్చు అవుతోందో మొత్తం వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టంగా చెప్పారు. ఈ సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.