గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ రాతపరీక్షను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇవాళ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది
హైదరాబాద్ : గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ రాతపరీక్షను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇవాళ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించిన ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.
మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
అక్టోబర్ 21 – జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్)
అక్టోబర్ 22 – పేపర్ 1(జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23 – పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
అక్టోబర్ 24 – పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)
అక్టోబర్ 25 – పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్మెంట్)
అక్టోబర్ 26 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్)
అక్టోబర్ 27 – పేపర్ 6(తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్)