Harish Rao | ఆసుపత్రుల క్యాంటిన్లకు 20కోట్ల బిల్లులు పెండింగ్‌: హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆసుపత్రుల క్యాంటిన్లకు 20కోట్ల బిల్లులు చెల్లించకుండా రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతుందని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు.

Harish Rao | ఆసుపత్రుల క్యాంటిన్లకు 20కోట్ల బిల్లులు పెండింగ్‌: హరీశ్‌రావు

రోగుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం
మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం ఆసుపత్రుల క్యాంటిన్లకు 20కోట్ల బిల్లులు చెల్లించకుండా రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతుందని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోగులు, వైద్యులు తిండి లేక అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. ప్రనుత్వం వెంటనే పెండింగ్‌ బిల్లులు చెల్లించి ప్రజల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు. వరుసగా ప్రభుత్వ వైఫల్యాలపై ట్విటర్ వేదికగా విమర్శలు సంధిస్తున్న హరీశ్‌రావు ఈసారి ఆసుపత్రుల క్యాంటన్ల బిల్లుల సమస్యను లెవనెత్తారు.