Harish Rao | విద్యాశాఖ వివరణపై హరీశ్‌రావు అసంతృప్తి
ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే, అసలు సమస్యలే లేవు అన్నట్లు విద్యాశాఖ ప్రకటించడం సరికాదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు

వాస్తవాలను విస్మరించారని విమర్శ
ఇవిగో పాఠశాలల సమస్యలు.. పరిష్కంచాలని వినతి
విధాత : ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే, అసలు సమస్యలే లేవు అన్నట్లు విద్యాశాఖ ప్రకటించడం సరికాదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సమస్కలను పరిష్కరించకుండా, వాస్తవాలను పక్కనబెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. ఇవే సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని నిర్దారించేటందుకు, ఈ రోజు నా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతా ఈ సమస్యల పూర్తి వివరాలను మీ దృష్టికి తెస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కారం చూపాలని కోరుతున్నాను అని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
ఇవిగో సమస్యలు….
తక్షణమే నేను ప్రస్తావిస్తున్న పాఠశాలల్లోని ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కుక్ కం హెల్పర్‌లకు చెల్లించే రూ. 3 వేల గౌరవ వేతనం 5 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి చెల్లింపు చేయాలని కోరారు. తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు . గత నాలుగు నెలల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయిని, ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు రెండు నెలలు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. కోడిగుడ్డు బిల్లులు నాలుగు నెలలు పెండింగ్‌లోనే ఉన్నాయని, సర్వశిక్ష అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ల వేతనాలు రెండు నెలలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ప్రతి పాఠశాలకు నెలకు రూ.10వేలు విడుదల చేసి, పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని, పేద విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ఆగిపోయిందని, ఈ కార్యక్రమాన్ని సహృదయంతో తిరిగి పునర్ ప్రారంభించాలని కోరుతున్నామన్నారు. పాఠశాలలకు ఉచిత కరెంట్ అందిస్తామని స్వయంగా మీరు హామీ మాటలకే పరిమితమైందని, ఇందుకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసెస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 9వేల ఖాళీలు ఏర్పడ్డాయి. డీఎస్సీ రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే లోగా, పిల్లలకు విద్యాబోధన జరిగేలా విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. గతేడాదికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని కోరారు.