Harish Rao | దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
"బీఆర్ఎస్ దిమ్మెల జోలికొస్తే నీ గద్దె కూలడం ఖాయం!" సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్. సింగరేణి నైనీ టెండర్లలో రేవంత్ బావమరిదికి లబ్ధి చేకూర్చారని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్.
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే.. నీ గద్దె కూలడం ఖాయం, జాగ్రత్త! దుమ్ము.. దుమ్ము అయిపోతావ్! అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలంటూ ఖమ్మం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సీఎం రేవంత్ పిలుపునివ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అన్నారు. బీఆర్ఎస్ లు దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతిరిగే లా బదులిస్తాం, ప్రజాక్షేత్రంలో ప్రజల చేతనే గుణపాఠం నేర్పుతాము అని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, అసమర్థత మాటలు రేవంత్ కట్టిబెట్టి ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి, మంత్రుల వాటాల పంచాయతీల్లో జర్నలిస్టుల బలి
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాటాల పంచాయితీలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలయ్యారు అని హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టులు మా మనుషులకు కావాలంటే మా మనుషులకు కావాలని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొట్లాడుతున్నారు అన్నారు. బీజేపీకి, రేవంత్ రెడ్డికి అక్రమ సంబంధం లేకపోతే, నైని బ్లాక్ టెండర్ల రద్దు మీద వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని
బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామన్నారు.
బొగ్గు గనుల కేటాయింపు టెండర్ల ప్రక్రియలో సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం అనేది దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదు అని, సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి లబ్దిదారుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి అని హరీష్ రావు ఆరోపించారు. టెండర్లు ఆన్‌లైన్‌లో వేయకుండా కాంట్రాక్టర్లు సైట్‌కు వెళ్లి చూసి సింగరేణి నుండి ఈ సర్టిఫికెట్ పొందాల్సి ఉందని, తద్వారా టెండర్లు ఎవరు వేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ముందే తెలుసుకున్నాడు.. తర్వాత వారిని భయబ్రాంతులకు గురిచేసి టెండర్లు రద్దు చేసుకోవాలని బెదిరించి, టెండర్లను తన అనునాయులకు కట్టబెడుతున్నాడు అని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇవి కూడా చదవండి :
7 Rupees Theft Case : రూ.7 చోరీ కేసు.. 50 ఏళ్ల తర్వాత తుది తీర్పు.. ఇప్పటికీ దొరకని దొంగల ఆచూకీ..!
Indore Crorepati Beggar : మూడు లగ్జరీ ఇళ్లు, కారు, వడ్డీ వ్యాపారాలు.. రూ.కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. విలాసాలు చూస్తే షాకే
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram