Heavy Rains | హైదరాబాద్ నగరంలో భారీ వర్షం.. మరో 2 గంటల పాటు కుండపోతే..!
Heavy Rains | హైదరాబాద్ నగరం( Hyderabad City )లో మరోసారి భారీ వర్షం( Heavy Rain ) కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా వాన దంచికొట్టింది. మరో 2 గంటల పాటు కుండపోత( Downpour ) వర్షం కురిసే అవకాశం ఉంది.

Heavy Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం( Hyderabad City )లో మరోసారి భారీ వర్షం( Heavy Rain ) కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా వాన దంచికొట్టింది. మరో 2 గంటల పాటు కుండపోత( Downpour ) వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
తెల్లవారుజాము నుంచి దంచి కొడుతున్న వానకు భాగ్యనగరం తడిసిముద్దైంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వస్తువులు తడిచిపోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డీకపూల్, సెక్రటేరియట్, రాంనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, అమీర్‌పేట, బేగంపేట, అంబర్‌పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, లక్డీకాపూల్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, సంతోష్ నగర్, రామాంతాపూర్, ఉప్పల్, మెహిదీపట్నం, కొండాపూర్, గచ్చిబౌలితోపాటు పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతున్నది. లక్డీకపూల్, నాంపల్లి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక కోఠి, మొజంజాహీ మార్కెట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక వైపు భారీ వన కురుస్తుండటం, మరోవైపు వీధీ దీపాలు వెలుగకపోవడంతో వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారిందని, శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం మీదుగా విదర్భ వద్ద తీరం దాటే అవకాశముందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గురువారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ, సూర్యాపేటలో భారీ వర్షాలు కురిశాయని వెల్లడించింది.