Heavy Rains | నేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు.. జర జాగ్రత్త..!
Heavy Rains | గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో వానలు( Rains ) లేవు. పగటి ఉష్ణోగ్రతలు( Temperatures ) భారీగా నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ( Weather ) చల్లని కబురు అందించింది.

Heavy Rains | హైదరాబాద్ : గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో వానలు( Rains ) లేవు. పగటి ఉష్ణోగ్రతలు( Temperatures ) భారీగా నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ( Weather ) చల్లని కబురు అందించింది. తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా నేటి నుంచి ఆదివారం వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రైతులు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు బయటకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించింది.
మెరుపులు సంభవించే అవకాశం ఉంది కాబట్టి వ్యవసాయ పొలాల్లో పని చేసుకునే రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మెరుపులు మెరిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు సమీపంలో ఉండకూడదని తెలిపింది. గొడుగు వెంట తీసుకెళ్లాలని సూచించింది.
ఇక గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. శుక్రవారం నాడు నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో, శనివారం నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, ఆదివారం నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.