HMWSSB | రేపు హైద‌రాబాద్ న‌గ‌రంలో నీటి స‌ర‌ఫ‌రా బంద్..!

HMWSSB | హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రోసారి నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్పడ‌నుంది. ఈ నెల 26వ తేదీన న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు వెల్ల‌డించారు.

  • By: raj |    telangana |    Published on : Nov 25, 2025 8:40 AM IST
HMWSSB | రేపు హైద‌రాబాద్ న‌గ‌రంలో నీటి స‌ర‌ఫ‌రా బంద్..!

HMWSSB | హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రోసారి నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్పడ‌నుంది. ఈ నెల 26వ తేదీన న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు వెల్ల‌డించారు. మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణాఫేజ్‌-1, 2, 3 పంపింగ్‌ స్టేషన్లకు విద్యు త్‌ సరఫరా చేసే బల్క్‌ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్న క్ర‌మంలో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంద‌ని అధికారులు పేర్కొన్నారు.

నాసర్లపల్లి జలమండలి పంపింగ్‌ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్‌ స్టేషన్లకు మ‌ర‌మ్మ‌తుల కార‌ణంగా 26న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీటి స‌ర‌ఫ‌రాను నిలిపివేయ‌నున్నారు.

ఈ ఏరియాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంతరాయం

చార్మినార్, విన‌య్ న‌గ‌ర్, భోజ‌గుట్ట‌, రెడ్ హిల్స్, నారాయ‌ణ‌గూడ‌, ఎస్సార్ న‌గ‌ర్, మారేడ్‌ప‌ల్లి, రియ‌స‌త్ న‌గ‌ర్, కూక‌ట్‌ప‌ల్లి, షాహెబ్‌న‌గ‌ర్, హ‌య‌త్‌న‌గ‌ర్, సైనిక్‌పురి, ఉప్ప‌ల్, హ‌ఫీజ్‌పేట్‌, రాజేంద్ర‌న‌గ‌ర్, మ‌ణికొండ‌, బోడుప్ప‌ల్, మీర్‌పేట్ ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నుంది.