House collapse | వానకు తడిసి కూలిన మట్టి మిద్దె.. కుటుంబంలోని నలుగురు దుర్మరణం
House collapse | రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వానకు మట్టి మిద్దె తడిసిపోవడంతో ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. నాగర్ కర్నూల్ మండలంలోని వనపట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గొడుగు భాస్కర్, పద్మ (28) భార్యాభర్తలు.
House collapse : రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వానకు మట్టి మిద్దె తడిసిపోవడంతో ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. నాగర్ కర్నూల్ మండలంలోని వనపట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గొడుగు భాస్కర్, పద్మ (28) భార్యాభర్తలు.
వారికి ఇద్దరు కుమార్తెలు పప్పి (6), వసంత (7), ఒక కుమారుడు విక్కీ (15 నెలలు) ఉన్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యాబిడ్డలతో సంసారం సాఫీగా సాగిపోతోంది. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా అందరూ భోజనం చేసి పడుకున్నారు. తర్వాత వర్షం కురవడంతో మట్టి మీద నానిపోయి వారిపై పడింది.
ప్రమాదంలో భాస్కర్ భార్య పద్మ, ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భాస్కర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో గ్రామస్తులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భాస్కర్ పరిస్థితి కూడా విషమంగా ఉందన వైద్యులు తెలిపారు. కాగా, తెల్లారేసరికి ఒకే కుటుబంలో నలుగురు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram