Kalyana Lakshmi Scheme | క‌ళ్యాణ‌ల‌క్ష్మీతో పాటు తులం బంగారం పొంద‌డం ఎలా..? ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!

Kalyana Lakshmi Scheme | రాష్ట్రంలోని అన్ని కులాల్లోని నిరుపేద ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు( Girls Marriage ) క‌ళ్యాణ‌లక్ష్మీ ప‌థ‌కం( Kalyana Lakshmi Scheme ) కింద 1,00,116 రూపాయాల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt ) అంద‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కానికి అద‌నంగా తులం బంగారం( Tulam Gold ) ఇచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది. క‌ళ్యాణ‌ల‌క్ష్మీ( Kalyana Lakshmi Scheme )తో పాటు తులం బంగారం ప‌థ‌కం రేపోమాపో అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt ) సిద్ధ‌మ‌వుతుంది.

Kalyana Lakshmi Scheme | క‌ళ్యాణ‌ల‌క్ష్మీతో పాటు తులం బంగారం పొంద‌డం ఎలా..? ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!

Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు( Girls Marriage ) అండ‌గా ఉండాల‌నే ఉద్దేశంతో కేసీఆర్ ప్ర‌భుత్వం( KCR Govt ) క‌ళ్యాణ‌ల‌క్ష్మీ ప‌థ‌కం( Kalyana Lakshmi Scheme ) అమ‌లు చేసి.. 1,00,116 రూపాయల ఆర్థిక సాయం అందించిన సంగ‌తి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల( Assembly Elections ) సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ( Congress Party ).. క‌ళ్యాణ‌ల‌క్ష్మీ ప‌థ‌కం( Kalyana Lakshmi Scheme ) ల‌బ్ధిదారుల‌కు మ‌రో బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ల‌క్షా నూట ప‌ద‌హారు రూపాయాల‌తో పాటు అద‌నంగా తులం బంగారం( Tulam Gold ) కూడా ఆడ‌బిడ్డల పెళ్లిళ్ల‌కు కానుక‌గా ఇస్తామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలు( Poor Families ) కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారాన్ని క‌ట్ట‌బెట్టాయి.

ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt ).. కల్యాణలక్ష్మీ పథకానికి సంబంధించిన నిధుల‌ను ఈ ఏడాది ఆగ‌స్టులో విడుద‌ల చేసింది. క‌ళ్యాణ‌ల‌క్ష్మీ ప‌థ‌కం( Kalyana Lakshmi Scheme ) అమ‌లు కోసం రూ.1225.43 కోట్లను విడుదల చేసిన‌ట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్( Ponnam Prabhaker ) అధికారికంగా ప్ర‌క‌టించారు. పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులతో పాటు కొత్తగా అప్లై చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి నిధులను జమ చేయనున్న‌ట్లు వెల్ల‌డించారు. రూ. 1,00,116 తోపాటు తులం బంగారం కూడా రేపోమాపో ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో క‌ళ్యాణ‌ల‌క్ష్మీతో పాటు తులం బంగారం( Gold ) పొందేందుకు ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి..? అర్హ‌త‌లు ఏంటి..? ఏయే ధృవ‌ప‌త్రాలు స‌మ‌ర్పించాలి..? అనే సందేహాలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.. మ‌రి ద‌ర‌ఖాస్తు, అర్హ‌తుల వంటి వివ‌రాలు తెలుసుకుందాం..

క‌ళ్యాణ‌ల‌క్ష్మీ ప‌థ‌కానికి అర్హ‌త‌లు ఇవే..

1. క‌ళ్యాణ‌ల‌క్ష్మీ ల‌బ్ధిదారులు క‌చ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి( Telangana State ) చెందిన యువ‌తి అయి ఉండాలి.
2. యువ‌తికి క‌చ్చితంగా 18 ఏండ్లు నిండి ఉండాలి. యువ‌తిని పెళ్లాడ‌బోయే యువ‌కుడి వ‌య‌సు 21 ఏండ్లు నిండి ఉండాలి.
3. ద‌ర‌ఖాస్తుదారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేట‌గిరికి చెంది ఉండాలి.
4. యువ‌తి కుటుంబ వార్షిక‌ ఆదాయం( Income ) రూ. 2 ల‌క్ష‌ల‌కు మించ‌రాదు.

ఈ ధృవ‌ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి..

1.యువ‌తి పుట్టిన తేదీని నిర్ధారించేందుకు టెన్త్ మెమో( Tenth Memo )
2. న‌వ దంప‌తుల ఆధార్ కార్డులు( Aadhaar Cards )
3. కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం( Caste Certificate )
4. త‌ల్లిదండ్రులు ఆధార్ కార్డులు
5. పెళ్లి కుమార్తె, ఆమె త‌ల్లి బ్యాంకు ఖాతా వివ‌రాలు( Bank Pass Book )
6. ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రం( Income certificate )
7. పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.

ద‌ర‌ఖాస్తు చేయ‌డం ఎలా..?

క‌ళ్యాణ‌ల‌క్ష్మీకి దరఖాస్తు చేసుకునే వారు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లాలి. హోం పేజీలో “కళ్యాణ లక్ష్మి” ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పెళ్లి కుమార్తె వ్యక్తిగత సమాచారం మొదలు కులం, ఆదాయం, చిరునామా, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను నమోదు చేయాలి. అన్ని ధ్రువపత్రాలకు సంబంధించిన స్కాన్ కాపీని అప్ లోడ్ చేయాలి. సమాచారం మొత్తం అందించిన తర్వాత “Submit” ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.ఇదే వెబ్‌సైట్‌లోకి వెళ్లి కల్యాణలక్ష్మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు.