Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలతో పాటు జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక రైతు భరోసాపై మంత్రివర్గంలో చర్చించి నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంటారా..? లేక ముందుగానే విడుదల ప్రారంభిస్తారా.? అన్నది చూడాల్సి ఉంది.