అన్నా ! దేవుడే పంపించాడన్నా.. కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి

మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘అన్నా.. మీతో కలిసి పని చేయమని దేవుడే పంపించాడన్నా’ అని కేసీఆర్‌తో వ్యాఖ్యానించారు. ‘‘ ప్రస్తుతం రాష్ట్రానికి నష్టం జరుగుతోందని, ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నాళ్లకైనా కేసీఆర్‌తో కలిసి పని చేసే అవకాశం రావడం సంతోషం’’ అని జీవన్‌రెడ్డి అన్నారు

అన్నా ! దేవుడే పంపించాడన్నా.. కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకుని ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్దమయ్యారు. శుక్రవారం జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘అన్నా.. మీతో కలిసి పని చేయమని దేవుడే పంపించాడన్నా’ అని కేసీఆర్‌తో వ్యాఖ్యానించారు. ‘‘ ప్రస్తుతం రాష్ట్రానికి నష్టం జరుగుతోందని, ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చాల గ్యాప్ తర్వాతా ఇన్నాళ్లకైనా కేసీఆర్‌తో కలిసి పని చేసే అవకాశం రావడం సంతోషం’’ అని జీవన్‌రెడ్డి అన్నారు

ఎర్రవెల్లి కేసీఆర్ నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. తన నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛాలందించి, శాలువ కప్పి ఆత్మీయ అలింగనం చేసుకుని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దంపతులు వసంత సురేశ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులున్నారు.