కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు..వీడియోలు.. బర్త్ డే కేక్ కటింగ్‌లు చేస్తూ కొందరు..ర్యాష్ డ్రైవింగ్‌తో మరికొందరు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పొగొట్టుకుంటున్నఘటనల పరంపర కొనసాగుతుంది.
విధాత : కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు..వీడియోలు.. బర్త్ డే కేక్ కటింగ్‌లు చేస్తూ కొందరు..ర్యాష్ డ్రైవింగ్‌తో మరికొందరు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పొగొట్టుకుంటున్నఘటనల పరంపర కొనసాగుతుంది. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై వెలుతున్న అనిల్‌కుమార్(27), తన మిత్రుడితో కలిసి బ్రిడ్జిపై ఆగి సెల్ఫీలు దిగుతుండగా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఇన్నోవా కారు వారిని ఢీ కొట్టింది. అనిల్‌కుమార్ మీదుగా కారు దూసుకెళ్లగా అతను తీవ్రంగా గాయపడ్డాడు.
సమీపంలో ఉన్న పోలీసులు ప్రమాదాన్ని గుర్తించి వారిని కేర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతు అనిల్‌కుమార్ ప్రాణాలు వదిలాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని సీఐ మల్లేశ్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, జన్మదిన కేక్‌లు కట్ చేయడం వంటి చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.