IAS Srilakshmi’s Mining Case | ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ

IAS Srilakshmi’s Mining Case | ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ

IAS Srilakshmi’s Mining Case | విధాత: ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి(Y. Srilakshmi) తెలంగాణ హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో(Obulapuram Mining Case) తన నిర్దోషిగా ప్రకటించాలంటూ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ విచారించిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ 2022 అక్టోబర్ లో సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం శ్రీలక్ష్మి పిటిషన్ ను అనుమతించింది. తనను కేసు నుంచి తప్పిస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్ట సీబీఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇరుపక్షల వాదనలను పరిగణలోకి తీసుకుని తాజాగా విచారణ చేపట్టాలని సూచిస్తూ పిటిషన్ ను తిరిగి హైకోర్టుకు తిప్పి పంపింది. విచారణను మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది.

ఈ పిటిషన్ పై హైకోర్టులో సీబీఐ తన వాదనలు వినిపిస్తూ 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాకే ఓఎంసీ మైనింగ్ లీజింగ్ వ్యవహారం ఊపందుకుందని..ఓఎంసీ లీజులు కట్టబెట్టడానికి అన్ని రకాలుగా ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వాదించారు. ఈ కేసులో ఆరో నిందితురాలైన శ్రీ లక్ష్మీ వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారంటూ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. గతంలో ఇదే హైకోర్టు ఆమె పిటిషన్లు కొట్టివేసిందని గుర్తు చేసింది. ఈ విషయాలను రివిజన్ పిటిషన్ లో ప్రస్తావించకుండా ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి న్యాయస్థానం ఎప్పటికైనా తరాలుగా తేల్చింది కోర్టు తీర్పుతో ఆమె పాత్ర పై సీబీఐ విచారణ కొనసాగనంది ఈ విషయాన్ని ప్రస్తుతం రివిజన్ పిటిషన్ లో ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఓఎంసీ లీజుల మంజూరులో శ్రీలక్ష్మి(Srilakshmi) అధికార దుర్విని పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. కిందికోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టివేయడంతో ఆమెకు న్యాయస్థానాల్లో మరోసారి నిరాశే ఎదురైంది.