అడ్డుకుంటే పోలీస్‌స్టేషన్లు ముట్టడిస్తాం: రేవంత్
విధాత,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రేపు చలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కరోనా వేళ ప్రజలు బతికేందుకే అల్లాడుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్ ధరకు రెండింతలు పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు కలిసి రావాలని కోరారు. హైదరాబాద్ ధర్నాచౌక్ నుంచి రాజ్‌భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు […]

విధాత,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రేపు చలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కరోనా వేళ ప్రజలు బతికేందుకే అల్లాడుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్ ధరకు రెండింతలు పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు కలిసి రావాలని కోరారు. హైదరాబాద్ ధర్నాచౌక్ నుంచి రాజ్‌భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు రేవంత్ వెల్లడించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నిత్యకృత్యమైందని, రేపు తమ శ్రేణుల్ని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామన్నారు. ఎన్ని లక్షల మంది కార్యకర్తలను అరెస్టు చేసి ఏ జైల్లో పెడతారో చూస్తామని హెచ్చరించారు.