Telangana Budget | స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు.. ఇందిరా జీవిత బీమా పథకం కూడా అమలు
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఒకప్పుడు దేశంలో అగ్రగామికి నిలిచిన మహిళా స్వయం సహాయక సంఘాలు.. కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో, నిధుల లేమితో కుంటుపడ్డాయి.
పేద, మధ్య తరగతి మహిళాభ్యున్నతికి ఆర్థిక స్వాలంబనకు సహాయ సంఘాలు ఎంతో ఊతమిస్తాయి. వీటి పునరుద్ధరణకు ప్రతి ఏడాదికి కనీసం రూ. 20 వేల కోట్లకు తగ్గకుండా, వచ్చే ఐదేండ్లలో లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ రుణాలు మైక్రో, స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళలు పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇస్తాయి.
ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ. 10 లక్షల జీవిత బీమా చేయడం జరిగిందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram