పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని మరియాపురం గ్రామపంచాయతీ స్థానం గతంలో జనరల్‌ రిజర్వు అయింది. దీంతో అప్పట్లో బీరెడ్డి జార్జిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరుఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం జనరల్ మహిళా అవ్వడంతో తన భార్య సునీతను ఎన్నికల భరిలోకి దింపారు.

  • By: Subbu |    telangana |    Published on : Dec 07, 2025 11:55 AM IST
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి

విధాత: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని మరియాపురం గ్రామపంచాయతీ స్థానం గతంలో జనరల్‌ రిజర్వు అయింది. దీంతో అప్పట్లో బీరెడ్డి జార్జిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరుఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం జనరల్ మహిళా అవ్వడంతో తన భార్య సునీతను ఎన్నికల భరిలోకి దింపారు.

గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను చూపుతూ.. ప్రభుత్వం తరుఫున వచ్చిన నిధులు మాత్రమే కాకుండా అదనంగా తన సొంత డబ్బుతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, ఈ సారి కూడా తన భార్య సునీతను గెలిపిస్తే గ్రామపంచాయతీని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు.

గతంలో తాను చేసిన అభివృద్ధి పనుల జాబితాను, వాటికి ఖర్చు చేసిన నిధులు, ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలను పాంప్లేట్స్ రూపంలో పంచుతూ.. ప్రచారం చేస్తున్నారు. తన పదవీకాలంలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ. 91లక్షలు ఖర్చు చేస్తే.. ప్రభుత్వం నుంచి రూ.29 లక్షలు మాత్రమే వచ్చాయని వెల్లడించారు.