Bhanu Chander| నవీన్ యాదవ్ ను గెలిపించండి : నటుడు భానుచందర్
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సినీ నటుల నుంచి క్రమంగా మద్దతు పెరిగింది. ఆదివారం మరో సీనియర్ నటుడు భానుచందర్ కూడా నవీన్ యాదవ్ ను గెలిపించాలంటూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills By elections) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు(Naveen Yadav) సినీ నటుల నుంచి క్రమంగా మద్దతు పెరిగింది. ఇటీవల సీనియర్ నటుడు సుమన్ నవీన్ కు మద్దతు తెలిపి..ఆయనను గెలిపించాలని ఓ సెల్పీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం మరో సీనియర్ నటుడు భానుచందర్(Bhanu Chander), కూడా నవీన్ యాదవ్ ను గెలిపించాలంటూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.
నవీన్ యాదవ్ మంచి వాడు అని..అతడిని తప్పకుండా గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. చిన్న శ్రీశైలం కొడుకు నవీన్ యాదవ్ తన తండ్రి కంటే గొప్ప పేరు సాధించాలని ఆకాంక్షించారు. పులిబిడ్డ పులి అవుతుందని..నవీన్ యాదవ్ పులి లాంటి వాడని కితాబునిచ్చారు. మరోవైపు నవీన్ యాదవ్ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారం ప్రారంభించి..వివిధ డివిజన్లలో ప్రజలను కలుస్తు తన ప్రచారంలో వేగం పెంచారు.