KA Paul| కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది.

KA Paul| కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు

విధాత, హైదరాబాద్ : ప్రజాశాంతి పార్టీ (Prajashanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul)పై  పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో( Punjagutta Police Station) కేసు (Sexual Harassment Case) నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. లైంగిక ఆరోపణలపై ఆధారాలను బాధితురాలు షీ టీమ్‌కు అందించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇటీవలే కేఏ పాల్ ఆస్తులకు సంబంధించిన వివాదం నెలకొంది. తన ఆస్తులను కొట్టేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై లైంగిక వేధింపులు కేసు నమోదు కావడం గమనార్హం.