విధాత, ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరంలో నిర్మించిన పురాతన మ్యూజియంలో శతాబ్దాల నాటి శిల్ప కళా సంపద విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజియాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. రూ. 1.20 కోట్ల వ్యయంతో నిర్మించబడిన నూతన మ్యూజియాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి గవర్నర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మ్యూజియంను పరిశీలించి, అందులో ఏర్పాటు చేసిన విభిన్న శిలా సంపదను ఆసక్తిగా వీక్షించారు. ఈ మ్యూజియం చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మించారు. యువత, విద్యార్థులు ఈ మ్యూజియంను సందర్శిస్తే శిలా సంపదపై అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటోంది. ఈ మ్యూజియంలో 11,12, 13 శతాబ్దాలకు చెందిన అతిపురాతన శిల్పసందను ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలకు చరిత్రపట్ల అవగాహన కలిగేందుకు ఎంతో దోహదం చేస్తుందన్నారు.
కాళేశ్వర్యంలో పురాతన మ్యూజియం ప్రారంభం ..ఆకట్టుకుంటున్న శతాబ్దాలనాటి శిల్పసంపద
కాళేశ్వరంలో నిర్మించిన పురాతన మ్యూజియంలో శతాబ్దాల నాటి శిల్ప కళా సంపద విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజియాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు

Latest News
పోతునూరు రైతుల “వరి” గోస
మళ్లీ పడిపోయిన పసిడి, వెండి ధరలు
షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు
రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం
వైరల్ వీడియో…ఆవు బొమ్మకు పాలు తాగేందుకు దూడ యత్నం !
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు