తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టడం వైరల్ గా మారింది. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా కవిత వివాహం జరిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. తెలంగాణ రక్షణ సేన నాయకుడు, తెలంగాణ జాగృతి నేత బాషబోయిన బాలప్రసాద్ వివాహం కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో ఇంటి ఆడబిడ్డగా ఉండి పెళ్లి చేయాలని బాలప్రసాద్ తన కోరికను కవితకు వివరించారు.
ఈ క్రమంలో ఈసీఐఎల్ – కీసర క్రాస్ రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్‌లో వేడుకగా జరిగిన బాలప్రసాద్, శివాని వివాహానికి కవిత హాజరై ముదిరాజ్ సంప్రదాయం మేరకు పెళ్లి తంతు జరిపించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం గౌరీ పూజలో పాల్గొన్న కవిత.. వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగి, ఒడిబియ్యం పోసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు.
ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత గారు
ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత గారు, తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని… pic.twitter.com/ZU36qLRRIh
— Telangana Rakshana Sena (@TRSparty_HQ) August 26, 2026
