Kavithra Yatra : కవితమ్మ..తగ్గేదే లేదమ్మో…!
బీఆర్‌ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కవిత, అక్టోబర్ 25 నుండి ఫిబ్రవరి 13 వరకు 33 జిల్లాల్లో 'తెలంగాణ యాత్ర'కు సిద్ధమవుతున్నారు. సంస్థాగత బలోపేతంలో భాగంగా తాజాగా 'తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్'ను ఆమె ప్రకటించారు.

విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి తన రాజకీయ లక్ష్యాల దిశగా వేగంగా ముందుకెలుతుంది. కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైఫల్యాలపైన, నిర్ణయాలపైన స్పందించడంతో పాటు ప్రజాసమస్యలపై ఆందోళనలతో నిత్యం రాజకీయంగా వార్తల్లో ఉంటూ వస్తుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశాక.. కొత్త పార్టీ పెట్టాలా వద్దా..లేక ఏదైన జాతీయ పార్టీలో చేరాలా అన్నదానిపై డైలామాలో ఉన్న కవిత అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో యాత్రకు సిద్దమైంది. తన తెలంగాణ యాత్ర ద్వారా భవిష్యత్తు రాజకీయ కార్యచరణ నిర్ణయించుకుంటానని ఆమె ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు వరుసగా జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తూ..కమిటీలను భర్తీ చేస్తూ సంస్థాగత పటిష్టత చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జాగృతికి అనుబంధంగా సింగరేణిలో సంస్థను ఏర్పాటు చేసిన కవిత.. తాజాగా తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ను ప్రకటించారు. ఫౌండర్ ప్రెసిడెంట్ వీరభద్రం సహా పలువురు ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో కవిత జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ను ప్రకటించారు. టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సమస్యలతో తమ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఈ సందర్బంగా కవిత మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ..తన కుమారుడు ఆధిత్య బీసీ బంద్ లో పాల్గొనడాన్ని..రాజకీయ ఎంట్రీగా భావించవద్దని..ప్రస్తుతం ఆయనకు 21ఏళ్లు మాత్రమేనని, రాజకీయాల్లోకి వచ్చే వయసు కూడా కాదన్నారు.