విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కీలకం నిర్ణయం తీసుకుంది. టీ.20వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు, బాక్సింగ్‌లో రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన రాష్ట్రానికే చెందిన నిఖత్ జరీన్‌కు గ్రూప్ కేడర్‌లో డీఎస్పీ ఉద్యోగాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. గత బీఆరెస్ ప్రభుత్వంలోనే నిఖత్ జరీన్‌కు ఉద్యోమిస్తాని ప్రకటించినా ఇవ్వలేదు. ఇదే విషయమై తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి వారిద్దరికి గ్రూప్ 1 ఉద్యోగమిస్తామని చెప్పి అందుకు అనుగుణంగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల క్రీడాకారులు..క్రీడాభిమానులు హర్షం వ్యక్తం
TELANGANA GOVT | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..సిరాజ్,జరీన్‌లకు గ్రూప్ 1 ఉద్యోగాలు
