TGPSC Group 1 exam| గ్రూప్-1 ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులకు హైకోర్టు ఊరట

గ్రూప్-1 ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. గ్రూప్ 1నియామకాలు సక్రమేనని స్పష్టం చేసిన సీజే ధర్మాసనం..సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్షలలో అవతవకలు జరిగినట్లుగా ఆధారాలు లేవని, పరీక్షలు పారదర్శకంగానే జరిగాయని స్పష్టం చేసింది

విధాత, హైదరాబాద్ : గ్రూప్-1 ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. గ్రూప్ 1నియామకాలు సక్రమేనని స్పష్టం చేసిన సీజే ధర్మాసనం..సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్షలలో అవతవకలు జరిగినట్లుగా ఆధారాలు లేవని, పరీక్షలు పారదర్శకంగానే జరిగాయని స్పష్టం చేసింది.

గ్రూప్ – 1 జనరల్ ర్యాంకింగ్‌ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. అయితే సింగిల్ జడ్జీ ఆదేశాలపై టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో అప్పిల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజే అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌ ధర్మాసనం పరీక్షలు, నియామకాలు సక్రమేనని తుది తీర్పునిచ్చింది. దీంతొ ఇప్పటికే అపాయింట్మెంట్ లేటర్లు అందుకున్న మొత్తం 563 మంది అభ్యర్థులకు భారీ ఊరట లభించింది.

2024 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించింది. అయితే పరీక్ష్ పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్‌ శివనగర్‌కు చెందిన కె.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను రద్దు చేశారు.

గ్రూప్‌–1 మెయిన్స్‌ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్‌ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సింగిల్‌ జడ్జి బెంచ్‌ తేల్చి చెప్పింది.

అయితే ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఉద్యోగాలకు ఎంపికైన పలువరు అభ్యర్థులు మళ్లీ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో.. ఈ పిటిషన్లంటినీ కలిపి విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధ్విసభ్య ధర్మాసనం పరీక్షల నిర్వహణ, నియామకాలు పారదర్శకంగానే జరిగాయని తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు ఉద్యోగాలు పొందిన వారితో పాటు టీజీపీఎస్సీకి, ప్రభుత్వానికి కూడా ఊరటనిచ్చింది.

Latest News