Khairatabad RTA | కాసులు కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్లు.. ‘9999’ నంబర్‌కు అత్యధికంగా రూ.22 లక్షలు
Khairatabad RTA | ఫ్యాన్సీ నంబర్లు తెలంగాణ రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 11 ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి రూ. 65,38,889 లక్షల ఆదాయం సమకూరింది.
Khairatabad RTA | హైదరాబాద్ : ఫ్యాన్సీ నంబర్లు తెలంగాణ రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 11 ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి రూ. 65,38,889 లక్షల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ అధికారికంగా వెల్లడించారు. అత్యధికంగా TG 09 H 9999 నంబరు రూ.22,72,222ల ధర పలుకగా, ఈ నంబర్‌ను నర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ఎల్పీ అధినేతలు కైవసం చేసుకున్నారు. అతి తక్కువగా TG 09 J 0003 నంబరుకు రూ.1,15,121ల ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ కైవసం చేసుకుంది.
మిగతా నంబర్లకు ఆదాయం ఇలా..
TG 09 J 0009 రూ. 6,80,000ల ఆదాయం రాగా ఈ నంబర్‌ను మెస్సర్స్ దండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం దక్కించుకుంది.
TG 09 J 0006 రూ. 5,70,666ల వేలం పాడగా ఈ నంబర్‌ను సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ యాజమాన్యం దక్కించుకుంది.
TG 09 J 0099 రూ. 3,40,000ల ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను మెస్సర్స్ గోదావరి ఫార్చూన్ సంస్థ దక్కించుకుంది.
TG 09 J 0001 రూ.2,60,000ల ధర పలుకగా ఈ నంబర్‌ను శ్రీనిధి ఐటీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కైవసం చేసుకుంది.
TG 09 J 0005 రూ.2,40,100ల ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను నిహారిక ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్థ దక్కించుకుంది.
TG 09 J 0018 రూ.1,71,189లకు ఈ నంబర్‌ను రోహిత్ రెడ్డి ముత్తు అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు.
TG 09 J 0007 రూ.1,69,002లకు ఈ నంబర్‌ను కొండవరపు శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి దక్కించుకున్నారు.
TG 09 J 0077 రూ.1,41,789ల ఆదాయం సమకూరగా ఈ నంబర్‌ను మీనాక్షి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కైవసం చేసుకుంది.
TG 09 J 0123 రూ.1,19,999ల ధర పలుకగా ఈ నంబర్‌ను ఆకుల మాధురి అనే మహిళ దక్కించుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram