కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ డ్రైవర్‌ అరెస్టు

సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వివాదస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో రచ్చ కొనసాగుతుండగానే..మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేయడం ఆసక్తి రేపింది. తెల్లాపూర్‌లోని సుమంత్‌ ఇంటి ముందు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సుమంత్ పై ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.

విధాత : సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వివాదస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో రచ్చ కొనసాగుతుండగానే..మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేయడం ఆసక్తి రేపింది. తెల్లాపూర్‌లోని సుమంత్‌ ఇంటి ముందు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సుమంత్ పై ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇనుపరాడ్లతో వ్యాపారిపై దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగానే సుమంత్‌ డ్రైవర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. సుమంత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మేడ్చల్‌ మల్కాజగిరి జిల్లా మేడిపల్లిలో సుమంత్‌పై కేసు నమోదు చేశారు.రాడ్లతో దాడి చేసినట్లు వ్యాపారి గొంగడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. సుమంత్‌పై 109 సెక్షన్‌ కింద కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు ఆ కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయ్యింది. సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

 

Latest News