Fire Accident In Alwal | హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ అల్‌వాల్ లో సైకిల్ షాపు నుంచి మొదలైన అగ్నిప్రమాదం 6 దుకాణాలకు వ్యాపి భారీ ఆస్తి నష్టం జరిగింది. ప్రాణాలు తప్పాయి.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ అల్వాల్ పరిధిలోని లోతుకుంట వద్ద శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ సైకిల్ షాపులో మొదలైన మంటలు పక్కనే ఉన్న మరో ఎనిమిది దుకాణాలకు విస్తరించాయి. అగ్ని కీలలు భారీగా ఎగిసిపడుతూ వేగంగా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేపట్టారు.
ఈ ఘటనలో ఆరు దుకాణాలు దగ్ధం కాగా ఆస్తి నష్టం వాటిల్లింది. దుకాణాలలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.