మేడ్చల్ మల్కాజ్‌గిరి : సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో భూవివాదం నెలకొంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఇతరులకు మధ్య భూవివాదం ఉంది. తన భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని మల్లారెడ్డి మండిపడ్డారు. వేసిన ఫెన్సింగ్‌ను కూల్చాలంటూ తన అనుచరులకు మల్లారెడ్డి చెప్పారు. దీంతో పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు.
తన స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం
కుత్బుల్లాపూర్ – పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని బారికెడ్లను పెట్టి కొందరు కబ్జా చేశారు.
స్థలంలో వేసిన బారికెడ్లను తొలగిస్తున్న మాజీ మంత్రి… pic.twitter.com/Uc0GAiGOYL
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2024
భారీ ఫెన్సింగ్‌ను కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వివాదంలోని భూమిలో ఘర్షణకు దిగొద్దని మల్లారెడ్డితో ఆయన అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తన భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగాడు. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ మల్లారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు.
ఈ క్రమంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వ్యక్తులు ఘటనాస్థలికి వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని ఆ 15 మంది తెలిపారు. కోర్టులో కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని స్పష్టం చేశారు. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు పోలీసులు సూచించారు.