తెలంగాణ అమరుల ఆత్మగౌరవ సూచికగా హుస్సేన్ సాగర్ ఒడ్డున స్మారక చిహ్నం
అమరుల త్యాగం ప్రతిబింబించేలా నిర్మాణం విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున తెలంగాణ అమరవీరుల స్మారకార్థం నిర్మిస్తున్న "అమరుల స్మారక చిహ్నం"నిర్మాణ పనులను సోమవారం రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరి పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని,నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి కావాలని వర్క్ ఏజన్సీని, అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి […]

అమరుల త్యాగం ప్రతిబింబించేలా నిర్మాణం
విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున తెలంగాణ అమరవీరుల స్మారకార్థం నిర్మిస్తున్న “అమరుల స్మారక చిహ్నం”నిర్మాణ పనులను సోమవారం రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరి పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని,నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి కావాలని వర్క్ ఏజన్సీని, అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్… తెలంగాణ అమరుల ఆత్మగౌరవ సూచికగా హుస్సేన్ సాగర్ ఒడ్డున అమరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నారని అన్నారు.నిత్యం వారి త్యాగాన్ని స్మరించుకునే విధంగా అమరుల స్మారక చిహ్నం గొప్ప కట్టడంగా నిలువనుందన్నారు.రాష్ట్రానికి ఏ ముఖ్య అతిథి వచ్చిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. తెలంగాణ అమరుల త్యాగాన్ని చాటిచెప్పే విధంగా ఈ నిర్మాణం ఉంటుందన్నారు. అనంతరం నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు.బ్లాక్ వైస్ పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగారు.పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ ని, ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్.ఈలు లింగారెడ్డి,సత్యనారాయణ ఈ.ఈ శశిధర్ పలువురు అధికారులు,వాస్తు నిపుణులు తేజ, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ లు పాల్గొన్నారు.